IPL 2022 Sixers : ఐపీఎల్ లో సిక్సర్ల మోత అరుదైన ఘనత
వారెవ్వా ఏమి చిత్రం 1000 సిక్సర్ల విసిత్రం
IPL 2022 Sixers : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఆఖరి దశకు చేరింది. కీలకమైన 74 లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. 10 జట్లు పాల్గొనగా డిఫెండింగ్ చాంపియన్లు ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇంటి బాట పట్టాయి. కానీ ఈసారి ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. ఒకటా రెండా యువ ఆటగాళ్లు పోటీ పడి ఆడారు. సీనియర్ క్రికెటర్లు తమ సత్తా తో ఆకట్టుకున్నారు.
ఇక అమ్మాయిలు, మిస్టరీ గర్ల్స్ , ముద్దుగుమ్మల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఓ వైపు ఆటగాళ్లు ఇంకో వైపు కెమెరాల క్లిక్కులతో ఐపీఎల్ సరదాగా సాగింది. ఇక ప్లే ఆఫ్స్ కు రాజస్తాన్ , గుజరాత్, లక్నో, బెంగళూరు చేరుకున్నాయి.
కోల్ కతా లో క్వాలిఫయర్ మ్యాచ్ లు కొనసాగుతుండగా అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ కొనసాగనుంది. ఇక ఈసారి ఐపీఎల్ 2022 మాత్రం అరుదైన ఘనత చోటు చేసుకుంది.
ఏకంగా అత్యధిక సిక్సర్ల రికార్డు(IPL 2022 Sixers) నమోదు చేసింది. కొత్త చరిత్రకు నాంది పలికింది. సింగిల్ 15వ సీజన్ లో ఏకంగా భారీ ఎత్తున సిక్సర్ల(IPL 2022 Sixers) మోత మోగడం విశేషం.
సన్ రైజర్స్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ హిట్టర్ లివింగ్ స్టోన్ కొట్టిన సిక్స్ తో వేయి సిక్సర్లు పూర్తయ్యాయి. ఇంకా మ్యాచ్ లు జరగాల్సి ఉండడంతో ఇంకెన్ని సిక్సర్లు నమోదవుతాయో చెప్పలేం.
2009లో 506 నమోదు కాగా 2022లో 1001 సిక్సర్లు(IPL 2022 Sixers) నమోదయ్యాయి. ఇక ఈసారి భారీ సిక్సర్లలో లివింగ్ స్టోన్ 117 మీటర్లు కొట్టగా టిమ్ డేవిడ్ 114 మీటర్లతో దుమ్ము రేపాడు.
Also Read : గుజరాత్ రాజస్తాన్ నువ్వా నేనా