IPS Transfers: ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ !

ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ !

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌ లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ‌ఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు. పాలనలో ప్రక్షాళన తీసుకురావడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు. చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్(IAS) అధికారుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా 37 మంది ఐపీఎస్‌లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.

IPS Transfers – బదిలీ అయిన అధికారులు వివరాలు !

శ్రీకాకుళం జిల్లా – కేవీ మహేశ్వర్‌రెడ్డి
విజయనగరం- వకుల్‌ జిందాల్‌
అనకాపల్లి- ఎం.దీపిక
సత్యసాయి జిల్లా- వి.రత్న
పార్వతీపురం మన్యం – ఎస్వీ మాధవరెడ్డి
కాకినాడ- విక్రాంత్‌ పాటిల్‌
గుంటూరు- ఎస్‌.సతీశ్‌ కుమార్‌
అల్లూరి జిల్లా – అమిత్‌ బర్దార్‌
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 1- అజితా వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్‌ 2గా – తుహిన్‌ సిన్హా

తూర్పుగోదావరి- డి.నరసింహ కిషోర్‌
అన్నమయ్య జిల్లా- వి.విద్యాసాగర్‌ నాయుడు
కోనసీమ జిల్లా – బి.కృష్ణారావు
కృష్ణా ఎస్పీ- ఆర్‌.గంగాధర్‌రావు
పశ్చిమగోదావరి జిల్లా – అద్నాన్‌ నయీమ్‌ ఆస్మీ
ఏలూరు జిల్లా- కె.ప్రతాప్‌ శివకిశోర్‌
పల్నాడు జిల్లా – కె.శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్‌ కమాండెంట్‌- మల్లికాగార్గ్‌
ప్రకాశం- ఏ.ఆర్‌.దామోదర్‌

కర్నూలు- జి.బిందు మాధవ్‌
నెల్లూరు జిల్లా- జి.కృష్ణకాంత్‌
నంద్యాల- అధిరాజ్‌సింగ్‌ రానా
కడప – వి.హర్షవర్ధన్‌ రాజు
అనంతపురం – కేవీ మురళీ కృష్ణ
బాపట్ల- తుషారు డూడీ
తిరుపతి – ఎల్‌.సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా అదనపు బాధ్యతలు
ఎన్టీఆర్‌ జిల్లా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌గా (శాంతి భద్రతలు) గౌతమీ శాలి
ఇంటెలిజెన్స్ అడ్మిన్‌ ఎస్పీగా వి.గీతాదేవి

Also Read : YS Sharmila: వైసీపీ నేతలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Leave A Reply

Your Email Id will not be published!