Irfan Pathan : ముంబైని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం

ఆ జ‌ట్టు ఓట‌మి నుంచే గెలుస్తుంది

Irfan Pathan : భార‌త స్టార్ మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ముంబై ఇండియ‌న్స్ పై . ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 2022లో ఆ జ‌ట్టు నాలుగు మ్యాచ్ లు ఓడి పోయింది.

ప్లే ఆఫ్ చేరాలంటే ప‌లు మ్యాచ్ లు గెల‌వాల్సి ఉంది. అయితే ఆ జ‌ట్టు ఓడి పోయాక తిరిగి గెలుస్తూ రావ‌డం అల‌వాటుగా మారింది. ఐపీఎల్ 15వ సీజ‌న్ ఆడుతున్న ముంబై ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ టైటిళ్ల‌ను ఐదుసార్లు గెలుపొందింది.

2008 నుంచి 2015 దాకా ఆజ‌ట్టు ఇలాగే అద్భుతాలు చేస్తూ వ‌చ్చింద‌న్నాడు. 10 మ్యాచ్ ల‌లో 8 మ్యాచ్ లు గెలుపొంది నాలుగో స్థానంలో నిలిచారు. ట్రోఫీని కైవ‌సం చేసుకునే ముందు వ‌రుస‌గా నాలుగు ఓడి పోయారు.

బుమ్రా ఒక్క‌డే రాణిస్తుండ‌డం ఆ జ‌ట్టును క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. బ్యాటింగ్ కాస్తా కూస్తో బాగున్నా బౌలింగ్ స‌రికి వ‌చ్చే స‌రికల్లా తేలి పోతోంది ముంబై ఇండియ‌న్స్. విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్క‌డం వాళ్ల‌కు బాగా తెలుసు అన్నాడు ఇర్ఫాన్ ప‌ఠాన్(Irfan Pathan).

ఈ ఏడాది బుమ్రాకు స‌రిపోయే ఇంకో బౌల‌ర్ లేక పోవ‌డం రోహిత్ శ‌ర్మ‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌న్నాడు. తిల‌క్ వ‌ర్మ రాణిస్తున్నాడు. సూర్య కుమార్ యాద‌వ్ స‌త్తా చాటుతుండ‌గా ఇషాన్ కిష‌న్ అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆడేందుకు రెడీగా ఉన్నాడు.

కానీ బౌలింగే కొంప ముంచుతోంద‌న్నాడు ప‌ఠాన్(Irfan Pathan). రోహిత్ శ‌ర్మ‌, పొలార్డ్ ఆశించిన స్థాయిలో ఆడ‌క పోవ‌డం కూడా పెద్ద దెబ్బేన‌ని పేర్కొన్నాడు. కాగా ప‌ఠాన్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Also Read : ఆర్సీబీ షాన్ దార్ ముంబై బేజార్

Leave A Reply

Your Email Id will not be published!