MLC Kavitha Arrest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తప్పదా..?
ఏం చేయబోతోంది ఈడీ ఏజెన్సీ
MLC Kavitha Arrested : అందరి కళ్లు ఇప్పుడు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ముందుకు విచారణకు హాజరుకానుంది. ఆమెకు అండగా ఉండేందుకు ఢిల్లీలో మకాం వేశారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. కవితను అరెస్ట్(MLC Kavitha Arrested) కాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన వైపునకు తిప్పుకునే సత్తా కలిగిన సీఎం కేసీఆర్ సైతం ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి 34 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 11 మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ కోర్టులో సమర్పించిన ఈడీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం అంతా హైదరాబాద్ లోనే ప్లాన్ జరిగిందని స్పష్టం చేసింది.
మనీష్ సిసోడియా తన స్వంత ఫోన్లను ధ్వంసం చేశారని , ఇతరుల ఫోన్లను వాడి తతంగం నడిపారంటూ పేర్కొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొంది ఈడీ. సౌత్ గ్రూప్ వెనుక కవిత ఉందని ఆరోపించింది. ఇక కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సోదరుడు మంత్రి కేటీఆర్. తన తండ్రి కేసీఆర్ ను టార్గెట్ చేయడంలో భాగంగానే తనను కేంద్రం వేధింపులకు గురి చేస్తోందంటూ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
Also Read : అబ్బే అలా అనలేదు – పిళ్లై