ISRO PSLV C54 : పీఎస్ఎల్వీ – సీ54 స‌క్సెస్

హైద‌రాబాద్ అంకుర విజ‌యం

ISRO PSLV C54 : ప్ర‌తిభ ఉండి కాస్తంత తోడ్పాటు అందిస్తే చాలు అద్భుతాలు చేయొచ్చంటూ నిరూపించారు ధ్రువ అంకుర సంస్థ నిర్వాహ‌కులు. ఒక‌ప్పుడు రాకెట్ల‌ను త‌యారు చేయాలంటే ఒక యుద్ధం చేయాల్సినంత ప‌రిస్థితి. కానీ విక్ర‌మ్ సారాభాయ్ పుణ్యం, డాక్ట‌ర్ ఏపీజే క‌లాం లాంటి మ‌హానుభావుల కృషి ఫలితంగా భార‌త దేశం పేరు ప్ర‌పంచ రోద‌సీ రంగంలో మారు మ్రోగుతోంది.

తాజాగా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) మ‌రో ఘ‌న‌త సాధించింది. ఇప్ప‌టికే ప్రైవేట్ సంస్థ ద్వారా రాకెట్ ను ప్ర‌యోగించి చ‌రిత్ర సృష్టించింది. పీఎస్ఎల్వీ – సీ54 రాకెట్(ISRO PSLV C54)  ప్ర‌యోగం స‌క్సెస్ అయ్యింది. ఏపీలోని తిరుప‌తి జిల్లా శ్రీ‌హ‌రికోట కేంద్రం నుంచి దిగ్వ‌జ‌యంగా ప్ర‌వేశ పెట్టారు.

ఈ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరింది. 1,117 కిలోల బ‌రువున్న ఓష‌న్ శాట్ -3 ఉప‌గ్ర‌హంతో పాటు మ‌రో 8 ఉప‌గ్ర‌హాల‌ను రోదసీకి పంపింది. ఇందులో హైద‌రాబాద్ కు చెందిన ధ్రువ స్టార్ట‌ప్ కంపెనీ రూపొందించిన థైబోల్ట్ శాట్ -1 , థైబోల్ట్ -2 ఉప్ర‌గ‌హాలు కూడా ఉన్నాయి.

మిగ‌తా వాటిలో భార‌త్, భూటాన్ సంయుక్తంగా త‌యారు చేసిన భూటాన్ శాట్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ సంస్థ త‌యారు చేసిన 4 అస్ట్రోకాట్ రాకెట్లు, బెంగ‌ళూరుకు చెందిన పిక్సెల్ త‌యారు చేసిన ఆనంద్ శాట్ ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా దేశంలో ఎక్క‌డా లేని రీతిలో మొద‌టిసారిగా ప్రైవేట్ గా రాకెట్ల‌ను ప్ర‌యోగించిన ఘ‌న‌త తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కు ద‌క్కుతుంది.

ఇటీవ‌లే హైద‌రాబాద్ కు చెందిన మ‌రో స్టార్ట‌ప్ స్కై రూట్ సంస్థ త‌యారు చేసిన రాకెట్ అంత‌రిక్షంలోకి దూసుకు వెళ్లింది. ఈ సంద‌ర్బంగా ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగించిన ఇస్రోను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ప్ర‌త్యేకంగా అభినందించారు.

Also Read : జ‌వాన్ కాల్పుల్లో ఇద్ద‌రు మృతి

Leave A Reply

Your Email Id will not be published!