AP Govt : పీఆర్సీ అమ‌లుపై ఏపీ స‌ర్కార్ జీఓ జారీ

కేవ‌లం ఐదేళ్ల వ‌ర‌కు మాత్ర‌మే

AP Govt  : సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లుగానే వేత‌న స‌వ‌ర‌ణ సంఘం (పీఆర్సీ) కు సంబంధించి జీఓ(AP Govt )జారీ చేసింది ప్ర‌భుత్వం. గ‌తంలో 10 ఏళ్ల‌కు ఉండేది. కానీ ఈసారి దానిని మార్పు చేశారు.

ఐదేళ్ల‌కు కుదించారు. ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా పీఆర్సీ బ‌కాయిల‌ను ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే స‌మ‌యంలోనే ఇచ్చేందుకు ఒక జీవో జారీ(AP Govt )చేసింది.

ఐఆర్ రిక‌వ‌రీ చేయ‌కుండా మ‌రో జీవో జారీ చేసింది స‌ర్కార్. ఎంప్లాయిస్ ప్ర‌యాణ‌పు భ‌త్యంతో పాటు అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించి రూ. 25 వేలు ఇచ్చేందుకు గాను వేర్వేరు జీవోల‌ను జారీ చేసింది ప్ర‌భుత్వం.

ఆయా ప్ర‌ధాన అంశాల‌కు సంబంధించి 8 జీవోల‌ను తీసుకు వ‌చ్చింది. కాగా ప్ర‌భుత్వం జారీ చేసిన 8 జీవోల ప్ర‌తుల‌ను ఆయా ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌కు అంద‌జేసింది.

పీఆర్సీ పెండింగ్ అంశాల అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు ఆర్థ‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్. ఎస్. రావ‌త్. ఇదే క్ర‌మంలో పెండింగ్ లో ఉన్న బిల్లుల‌ను కూడా త్వ‌ర‌లోనే చెల్లిస్తామ‌ని చెప్పారు.

కాగా పీఆర్సీ అమ‌లుకు సంబంధించి మ‌రో రెండు జీవోల‌ను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు రావ‌త్. ఇదే స‌మ‌యంలో ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ముఖ్య కార్య‌ద‌ర్శికి విన్న‌వించారు.

ప్ర‌భుత్వం ఉద్యోగుల ప‌ట్ల సానుకూలంగా ఉంద‌ని, ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు రావ‌త్. ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు ఏవైతే సీఎం హామీలు ఇచ్చారో వాటిని అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : అడ్మిష‌న్లు పెంచేందుకే పేప‌ర్ లీక్

Leave A Reply

Your Email Id will not be published!