Isudan Gadhvi : కావాల‌నే జైన్ వీడియోలు బీజేపీ లీక్

గుజ‌రాత్ ఆప్ సీఎం అభ్య‌ర్థి గాధ్వి ఫైర్

Isudan Gadhvi : అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు చేయ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని మించిన పార్టీ ఈ దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు ఆప్ గుజ‌రాత్ సీఎం అభ్య‌ర్థి ఇసుద‌న్ గాధ్వి(Isudan Gadhvi). శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేవ‌లం ఆప్ ను బ‌ద్నాం చేయ‌డంలో భాగంగానే బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్ర‌యోగిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఆప్ కు చెందిన మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ జైలులో ఉన్న వీడియోల‌ను లీక్ చేస్తూ ఓట్లు దండుకోవాల‌ని అనుకుంటోందంటూ మండిప‌డ్డారు. జైలు రూల్స్ ప్ర‌కారం నిందితులు లేదా జైలులో ఉన్న వారికి సంబంధించిన వీడియోల‌ను బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌కూడ‌ద‌న్నారు.

కానీ వీటికి తిలోద‌కాలు ఇచ్చి బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఇసుధ‌న్ గాద్వి(Isudan Gadhvi). గ‌త 27 ఏళ్లుగా గుజ‌రాత్ లో పాల‌న సాగిస్తున్న బీజేపీకి ప్ర‌జ‌ల‌ను ఓట్ల అడిగే నైతిక హ‌క్కు లేద‌న్నారు. రాష్ట్రాన్ని బ‌డా వ్యాపారులు, కార్పొరేట్ల‌కు లాభం చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఓ వైపు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. గుజ‌రాత్ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేక‌నే ఆప్ పై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు ఆప్ గుజరాత్ సీఎం అభ్య‌ర్థి ఇసుధ‌న్ గాంధ్వి.

ఇలాంటి చౌక‌బారు దుష్ప్ర‌చారం డిసెంబ‌ర్ 8 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. ఆ త‌ర్వాత ఇది క‌నుమ‌రుగు అవుతుంద‌ని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా వారి ఆట‌లు సాగ‌వ‌న్నారు.

జైలు సూప‌రింటెండెంట్ ను కాద‌ని ఎలా మ‌సాజ్ చేయించుకుంటార‌ని ప్ర‌శ్నించారు సువిధ‌న్ గాధ్వి.

Also Read : యెస్ బ్యాంక్ మాజీ ఎండీకి బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!