Munugodu By Poll : బరిలో ఎందరున్నా ముగ్గురి మధ్యే పోటీ
మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్లు క్లోజ్
Munugodu By Poll : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఇక్కడ బై పోల్(Munugodu By Poll) అనివార్యంగా మారింది. నవంబర్ 3న ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది.
ఇందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం అందిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. చివరకు పోటీలో ఏకంగా 83 మంది నిలిచారు. ఇంత మంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.
బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఇక మిగతా పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారనేది చెప్పలేం.
ఇక నల్గొండ జిల్లాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పేరుంది. సోదరుడు బీజేపీలో ఉంటే అన్న కాంగ్రెస్ లో ఉండడం విచిత్రం. పత్రాల చివరి రోజు 130 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది స్వతంత్రులుగా నిలిచారు. వీరిలో 47 మంది అభ్యర్థుల నామినేన్లు తిరస్కరణకు గురయ్యాయి.
చివరి రోజు 37 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపిన మేరకు నామినేషన్ల జాబితా ప్రకారం 83 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ప్రకటించారు. ఇక తెలంగాణ జనసమితి నుంచి పల్లె వినయ్ కుమార్ , బీఎస్పీ నుంచి ఆందోజు శంకరాచారి పోటీలో ఉన్నారు. వీరు కొంత మేరకు ఓట్లు చీల్చే చాన్స్ ఉంది.
Also Read : వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడను