Pravin Thogadia : విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా సంచలన కామెంట్స్ చేశాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈసారి భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనంత పోటీని ఎదుర్కొంటోందన్నారు.
ప్రధానంగా రైతులు , నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారు ప్రస్తుతం కీలకం కాబోతున్నారంటూ పేర్కొన్నారు. ఆయన నాగపూర్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపాయి.
పండించే పంటకు కనీస మద్దతు ధర , నష్ట పరిహారం గురించే రైతులు ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు. పూర్తిగా రైతులంతా గంప గుత్తగా బీజేపీ పట్ల తవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అర్థమవుతోందన్నారు తొగాడియా.
అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీటి గురించి అస్సలు పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వీహెచ్ పీ అన్నది బీజేపీలో ఓ వ్యవస్థగా ఉంటూ వచ్చింది. తొగాడియా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీలో కలకలం రేపాయి.
యూపీలో ప్రస్తుతం యోగి ఆదిత్యా నాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తొగాడియా చేసిన వ్యాఖ్యలతో విస్తు పోయింది. తమ పార్టీలో ఉంటూ ప్రవీణ్ భాయ్ తొగాడియా (Pravin Thogadia)ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించు కోలేక పోతున్నాయి.
ప్రస్తుతం 403 సీట్లకు గాను ఐదు విడతల పోలింగ్ అయి పోయింది. ఇంకా మూడు విడుతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈనెల 10న ఫలితాలు వెల్లడించనుంది.
యోగీ తన పూర్వ వైభవాన్ని చాటుతారా లేక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పవర్ లోకి వస్తాడా అన్నది వేచి చూడాల్సింది.
Also Read : ముబాశిర్ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై