Jagga Reddy : తానుంటే పార్టీకి నష్టం కలుగుతుందని సామాజిక మాధ్యమాలలో నన్ను చిత్రీకరించారు. దానిని కంట్రోల్ చేయాల్సిన వాళ్లు మిన్నకుండి పోయారు.
అందుకే ఇప్పటికే పార్టీకి సంబంధించి తన వెంట ఉన్న వారందరితో సమావేశం అయ్యాను. నా అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టాను. నేను ఎప్పుడూ లోపట ఒకటి బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని కాను.
మనసులో ఏం ఉంటే అదే బయటకు చెబుతా. ఇన్నేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశా. అవసరమైనప్పుడు నిలదీశా. నా మనస్తత్వమే అంత. కానీ తాను ఉండడం వల్ల కొందరు ఇబ్బంది పడుతున్నారు.
వారికి , పార్టీకి ఎందుకు అడ్డంకిగా ఉండడం అనుకుని తాను పార్టీని వీడేందుకే మొగ్గు చూపానని స్పష్టం చేశారు కాంగ్రెస్ టీపీసీసీ అగ్ర నేత జగ్గారెడ్డి(Jagga Reddy). ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. స్వంత పార్టీ పెడతానని అంటున్నారు.
టీఆర్ఎస్ లోకి వెళతానని ప్రచారం చేస్తున్నారు. అదంతా బక్వాస్ . పార్టీలో ఇంత కాలం పని చేసినోడిని. ఇంకొకరి కోసం వేచి చూస్తానా. పోయెటోడిని అయితే బాజాప్తాగా చెప్పి వెళతా అని అన్నారు.
అయితే ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. ఇదిలా ఉండగా ఓ నాయకుడు పార్టీని వీడొద్దంటూ ఆయన కాళ్లు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా జగ్గారెడ్డి పార్టీలోనే ఉంచేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శతవిధాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగ్గన్న ససేమిరా అంటున్నారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని చెప్పారు.
Also Read : టీఎస్పీఎస్సీ కాదది పోస్టాఫీస్