Parag Agarwal : పరాగ్ ను తొలగించడం చాలా కష్టం
భారీగా ముట్ట చెప్పాల్సిందే
Parag Agarwal : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను భారీ ధరకు పెట్టు కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో ఆయన దానిని చేజిక్కించు కోవాలంటే కంపెనీ రూల్స్ ప్రకారం ఆరు నెలలు ఆగాల్సి ఉంది.
ఇక భారతీయ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్(Parag Agarwal) ప్రస్తుతం ట్విట్టర్ సిఇఓగా ఉన్నారు. ఆయన స్వయం ప్రతిపత్తి కలిగిన ఉద్యోగి. ట్విట్టర్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిఇన మైక్రో బ్లాగింగ్ సోష్ మీడియా. కోట్లాది మంది దీనిని నిత్యం వినియోగిస్తున్నారు.
ట్విట్టర్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. ఈ సమయంలో ఉన్నట్టుండి బిగ్ ఆఫర్ తో ఎలోన్ మస్క్ షేర్లను కొనేసి తానే చేజిక్కించుకున్నాడు.
అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులు, వ్యాపారులు, ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరైనా ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేయవచ్చంటూ తెలిపాడు.
ఇదే సమయంలో ఎప్పుడైతే ఎలోన్ మస్క్ కొనుగోలు చేశాడో అప్పటి నుంచి ట్విట్టర్ పై ఆధిపత్యం ప్రదర్శించడం మొదలు పెట్టాడు. దీంతో ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం తెలిపాడు.
ఆయనకు మొదటి నుంచీ సిఇఓ పరాగ్ అగర్వాల్ పై నమ్మకం లేదు. ఆయనను బయటకు పంపించాలంటే చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. కోట్లల్లో ఉంటుంది.
లా విభాగాన్ని చూస్తున్న మరో అధికారిపై కూడా మస్క్ టార్గెట్ చేశారు. ఇక ఉద్యోగులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ భరోసా ఇచ్చాడు సిఇఓ పరాగ్ అగర్వాల్(Parag Agarwal).
Also Read : మళ్లీ పెరిగిన వంట గ్యాస్ మంట