KTR : ప్రభుత్వం సహకారం పెట్టుబడులకు స్వాగతం
ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
KTR : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎంతో మంది ప్రతిభ కలిగిన యువతీ యువకులు ఉన్నారని వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీని ప్రవేశ పెట్టిందని చెప్పారు.
పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తే తాము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) అందించిన సహకారం మరిచి పోలేనన్నారు.
వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు. లండన్ లో పర్యటంచిన కేటీఆర్ (KTR) మీడియాతో మాట్లాడారు.
గత ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, సాధించిన ప్రగతి గురించి కూలంకుషంగా వివరించారు కేటీఆర్.
తాము చేపట్టిన ఈ అధికారిక పర్యటనలో ఆయా కంపెనీల చీఫ్ లు, ప్రముఖులతో చర్చలు జరిపామని, వారంతా తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రాష్ట్రం చేస్తున్న ప్రయత్నానికి ఎన్నారైలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరారు కేటీఆర్(KTR) . రాబోయే రోజుల్లో యూకేతో తెలంగాణ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఓరుగల్లులో ఐటీ టవర్ ప్రారంభమైందన్నారు. త్వరలో మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఐటీ టవర్లు ప్రారంభిస్తామన్నారు.
అమెజాన్, గూగుల్, ఫేస్ బుక్, మైక్రాన్ , యాపిల్, క్వాల్ కామ్ , ఉబెర్, సేల్స్ ఫోర్స్ , నోవార్టీస్ , తదితర దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లో కొలువు తీరాయని చెప్పారు.
Also Read : మోదీ సర్కార్ పై కేసీఆర్ కన్నెర్ర