IT Raids : హైదరాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేశారన్న ఆరోపణలు లేక పోలేదు. ఈ తరుణంలో సోమవారం భారీ ఎత్తున ఐటీ శాఖకు చెందిన బృందాలు రంగంలోకి దిగాయి. పది బృందాలుగా విడి పోయాయి.
IT Raids in Telangana
ఇదిలా ఉండగా పేరు పొందిన ఓ ఫార్మాకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేపడుతున్నారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ చెల్లింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు సమాచారం.
కాగా ఎన్నికల సమయంలో దాడులు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు, ఐటీ, దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. పెద్ద ఎత్తున పలు చోట్ల నగదు పట్టు పడుతోంది. ఎక్కడికక్కడ టోల్ గేట్స్ వద్ద , 24 గంటల పాటు తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఒక రకంగా సదరు ఫార్మా కంపెనీపై పలు ఆరోపణలు ఈ మధ్యనే వెళ్లువెత్తాయి. ఇదే సమయంలో సోదాలు జరగడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది.
Also Read : Revanth Reddy : నేను చంద్రబాబు మనిషిని