IT Raids : జార్ఖండ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు
లెక్కలు చూపని రూ. 100 కోట్లు స్వాధీనం
IT Raids : ఆదాయా పన్ను శాఖ దేశ వ్యాప్తంగా దాడులు చేపట్టింది. జార్ఖండ్ లోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు చేపట్టింది. భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు లేకుండా ఉన్న రూ. 100 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ(IT Raids) ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కుమార్ జై మంగల్ అలియాస్ అనూప్ సింగ్ , ప్రదీప్ యాదవ్ ఇళ్లపై దాడికి దిగింది. ప్రస్తుతం జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమిలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు చెందిన స్థలాలు, వారి సహచరులు, అనుబంధిత బొగ్గు, ఇనుప ఖనిజం వ్యాపారాలపై గత వారం దాడులు చేపట్టంది.
ఆదాయపు పన్ను శాఖ రూ. 100 కోట్లకు పైగా విలువైన లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించింది. జార్ఖండ్ లోని రాంచీ, గొడ్డా, దుమ్కా, జంషెడ్ పూర్, చైబాసా, పాట్నా (బీహార్ ), గురు గ్రామ్ (హర్యానా) , కోల్ కతా (పశ్చిమ బెంగాల్ ) లో నవంబర్ లో జరిపిన సోదాల్లో 40 ప్రాంతాలను కవర్ చేసినట్లు కేంద్ర ఆదాయపు పన్ను శాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
బెర్మో సీటుకు చెందిన ఎమ్మెల్యే జై మంగల్ కూడా దాడులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దాడి బృందాలకు తాను సహకరించినట్లు చెప్పారు. జేవీఎం-పీ నుండి విడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన యాదవ్ పోరియాహత్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మొత్తం దాడులపై సీఎం హేమంత్ సోరేన్ ఇంకా స్పందించ లేదు.
Also Read : ఐటీ దాడుల్లో 2 కోట్లు పట్టివేత 100 కోట్లపై ఆరా