Deepika Padukone : అది స్కిన్ షో కాదు క‌థ కోస‌మే

కంగ‌నా కామెంట్స్ పై దీపికా ప‌దుకొనే

Deepika Padukone : దేశ వ్యాప్తంగా దీపికా ప‌దుకొనే న‌టించిన గెహ్రాయాన్ మూవీపై తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. దీపికా ఈ మూవీలో రెచ్చి పోయి న‌టించింది. ఈ మూవీపై మ‌రో బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సీరియ‌స్ అయ్యింది.

సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఇది మూవీ కాద‌ని పోర్న్ సినిమా అంటూ బాంబు పేల్చింది. డ‌బ్బుల కోసం స్కిన్ షో చేసిందంటూ దీపికా ప‌దుకొనేపై(Deepika Padukone) విరుచుకు ప‌డింది.

కంగనా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. మ‌రో వైపు తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటోంది. దీంతో త‌న‌పై ట్రోల్ ఎక్కువ కావ‌డంతో దీపికా ప‌దుకొనే స్పందించింది. తాను స్కిన్ షో చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

త‌న చేతిలో చాలా మూవీస్ ఉన్నాయ‌ని , దిగ జారాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. కంగ‌నా ర‌నౌత్ త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని తెలిపింది. ఎవ‌రో ఆక‌ర్షించేందుకు తాను న‌టించ లేదంది.

కాగా శ‌కున్ బాత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లైంది మిశ్ర‌మ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చి పోయింది.

అయితే క‌థ ప‌రంగా అలా చేశామే త‌ప్పా కావాల‌ని చేసింది కాద‌ని చెప్పింది దీపికా ప‌దుకొనే. పాత్ర‌ల మ‌ధ్య రిలేష‌న్స్ , ప్ర‌యాణం, సాన్నిహిత్యం నిజ‌మ‌ని న‌మ్మేలా చేసేందుకు న‌టించాన‌ని పేర్కొంది.

క‌థ‌లో భాగంగా అలా చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. తాను ముగ్గురు హీరోలతో ఇంటిమేట్ గా సీన్స్ ల‌లో చేశా. చాలా ఉత్తేజ‌క‌రంగా అనిపించింద‌ని దీపికా ప‌దుకొనే చెప్పింది.

అయితే డైరెక్ట‌ర్ శ‌కున్ బాత్రాను ఆకాశానికి ఎత్తేసింది. అత‌డితో ప‌ని చేయ‌డం త‌న‌కు ఆనందాన్ని ఇచ్చింద‌ని తెలిపింది.

Also Read : విజ‌య్ ‘అర‌బిక్ కుతు’ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!