Jack Dorsey Blue Sky : ట్విట్టర్ కు ధీటుగా జాక్ డోర్సే ప్లాన్
బ్లూ స్కై పేరుతో యాప్ టెస్టింగ్
Jack Dorsey Blue Sky : ట్విట్టర్ ఈ పదం తెలియని వారంటూ ఉండరు ఈ ప్రపంచంలో. సోషల్ మీడియాలో టాప్ లో కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ట్విట్టర్ సృష్టించిన సంచలనం వరల్డ్ లో ఇంకేదీ చేయలేదు. అంతటి ప్రాబల్యం కలిగిన ట్విట్టర్ ఈ మధ్య టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్నాక ఒడిదుడుకులకు లోనవుతోంది.
ఈ తరుణంలో ట్విట్టర్ కో ఫౌండర్ అయినటువంటి జాక్ డోర్సే ప్రత్యామ్నాయంగా మరో దానిని ప్లాన్ చేస్తున్నారు. దానికి అందమైన పేరు కూడా పెట్టాడు. అదే బ్లూ స్కై(Jack Dorsey Blue Sky) . ఇందుకు సంబంధించిన యాప్ కూడా రెడీ అయ్యింది. ప్రస్తుతం టెస్టింగ్ నడుస్తోంది. ఒకవేళ గనుక ఇది సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ పైకి వస్తే ట్విట్టర్ కు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణుల అంచనా.
ప్రధానంగా చిన్న గదిలో ప్రారంభమైన ట్విట్టర్ ఇవాళ ఊహించని ధరకు అమ్ముడు పోయంది. ఏకంగా రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. ప్రస్తుతం బీటా టెస్టింగ్ నడుస్తోందని స్వయంగా జాక్ డోర్సే వెల్లడించడం విశేషం. కోట్లాది మంది ప్రజలు స్వేచ్చగా తమ అభిప్రాయాలను పంచుకునే వేదికగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.
అలా ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన వెంటనే బ్లూస్కై గురించి టెస్టింగ్ మొదలు పెట్టడం కలకలం రేపింది. దీనిపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి.
బ్లూ స్కైని 2019లో ఏర్పాటు చేశారు డోర్సీ. ఇది ఎవరికి చెందినది కాదని పేర్కొన్నారు జాక్. 2021లో డోర్సే ట్విట్టర్ సిఇఓ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా బ్లూ స్కై హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ప్లీజ్ మన్నించండి మళ్లీ రండి – మస్క్