Jack Dorsey : ట్విట్టర్ కో ఫౌండర్, మాజీ సీఇఓ జాక్ డోర్సే(Jack Dorsey) కీలక కామెంట్స్ చేశారు. తాను స్థాపించిన సంస్థ ట్విట్టర్ ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది. స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదికగా నిలిచేలా ట్విట్టర్ ను ఆయన తీర్చిదిద్దారు.
కోట్లాది మంది ట్విట్టర్ ను వాడుతున్నారు. అంతకంటే ఎక్కువగా బిలియన్ల కొద్దీ ఆదాయం కూడా సమకూరుతోంది.
కానీ అనుకోని రీతిలో ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కోలుకోలేని షాక్ ఇచ్చాడు.
ట్విట్టర్ ప్రస్తుత కోట్ చేసిన షేర్ వాల్యూ కంటే ఎక్కువగా చెల్లించి స్వాధీనం చేసుకున్నాడు.
ఈ మేరకు ఒప్పందం కూడా జరిగి పోయింది. సిఇఓగా ఉన్న జాక్ డోర్సే గత కొన్ని నెలల ముందే తన పదవి నుంచి తప్పుకున్నాడు.
తనకు నమ్మకస్తుడైన భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ కు బాధ్యతలు అప్పగించాడు.
అంతకు ముందు అమెరికా, ఇండియా, తదితర దేశాలతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది ట్విట్టర్.
ఈ తరుణంలో కొనుగోలు చేయడంపై సర్వత్రా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా చర్చకు వచ్చింది
మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేయడం. భారత్ కు వ్యతిరేకంగా కంటెంట్ పబ్లిష్ చేయడాన్ని ఇండియా తప్పు పట్టింది
. ఒకానొక దశలో కోర్టు దాకా వెళ్లింది. ఇండియా ట్విట్టర్ హెడ్ పై కేసు కూడా నమోదైంది. ఈ సందర్భంగా నిన్నటి దాకా ట్వీట్లతో హోరెత్తించిన జాక్ డోర్సే(Jack Dorsey) ఉన్నట్టుండి స్వరం మార్చేశారు.
ఎలోన్ మస్క్ ను సింగులర్ సొల్యూషన్ అంటూ పేర్కొన్నారు. సరైన దిశలో ఒక అడుగు అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సూత్ర ప్రాయంగా ఎవరైనా ట్విట్టర్ ను స్వంతం చేసుకోవాలని లేదా నడపాలని నేను నమ్మను.
ఇది ప్రోటోకాల్ స్థాయిలో పబ్లిక్ శ్రేయస్సును కోరుకుంటుంది. ఒక కంపెనీ కాదు అని స్పష్టం చేశారు.
Also Read : ఎలోన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ కితాబు