Jack Dorsey Modi : మోడీ సర్కార్ బెదిరించింది – జాక్ డోర్సే
ట్విట్టర్ మాజీ సీఇఓ సంచలన కామెంట్స్
Jack Dorsey Modi : కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రముఖ బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ మాజీ సిఇవో జాక్ డోర్సే. ఆయన ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా మోడీని టార్గెట్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం జాక్ డోర్సే చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాక్ డోర్సే ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు.
మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు. అంతే కాదు భారత దేశంలో మోదీ సర్కార్ తీసుకు వచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ట్విట్టర్ కీలక భూమిక పోషించిందని జాక్ డోర్సే స్పష్టం చేశారు. తమకు ఎవరి పట్లా అభిమానాలు ఉండవని, ఉన్నది ఉన్నట్లు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు వీలు కల్పించామని చెప్పారు.
ఇదిలా ఉండగా రైతుల నిరసనలు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని, ట్విట్టర్ ఇండియా ఉద్యోగులపై దాడులు చేస్తామని, అరెస్ట్ చేస్తామని బెదిరించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని జాక్ డోర్సే(Jack Dorsey) బాంబు పేల్చారు. ప్రస్తుతం కేంద్ర సర్కార్ దీనిపై ఇంకా వివరణ ఇవ్వలేదు. మొత్తంగా మోదీ ప్రభ మసక బారుతోందని అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
Also Read : AP Politics Comment : ఏపీ రణ క్షేత్రంలో రాజు ఎవరో
