Jagadish Reddy : కోమ‌టిరెడ్డి ఇంజ‌నీరింగ్ స‌ర్టిఫికేట్ ఫేక్

విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

Jagadish Reddy : తెలంగాణ – రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ముదిరి పాకాన పడ్డాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఒక‌రిపై మ‌రొకరు వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

Jagadish Reddy Shocking Comments on Komati Reddy Venkat Reddy

తాజాగా త‌నను ఉద్దేశించి భువ‌న‌గిరి ఎంపీ , మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పై నిప్పులు చెరిగారు జ‌గదీశ్ రెడ్డి(Jagadish Reddy). ఏబీసీడీలు కూడా చ‌ద‌వ‌డం ఎంపీకి రాద‌ని ఎద్దేవా చేశారు. దొంగతనంగా ఇంజ‌నీరింగ్ స‌ర్టిఫికెట్ తెచ్చుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌కు ఐటీ శాఖ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని ఈ విష‌యం ప్ర‌జ‌లు తెలుసు కోవాల‌న్నారు.

అడ్డ‌గోలుగా మాట్లాడితే ఇక్క‌డ ఎవ‌రూ ఊరుకోర‌ని హెచ్చ‌రించారు. త‌మ‌తో పెట్టుకుంటే పుట్ట‌గ‌తులు ఉండవ‌ని హెచ్చ‌రించారు. ఎన్ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికినా చివ‌ర‌కు గెలిచేది భార‌త రాష్ట్ర స‌మితేన‌ని పేర్కొన్నారు. ఇంకోసారి నోరు జారితే ఊరుకోన‌ని హెచ్చ‌రించారు విద్యుత్ శాఖ మంత్రి గుండ్ల‌క‌ట్ల జ‌గ‌దీశ్ రెడ్డి.

Also Read : Nandikanti Sridhar : కాంగ్రెస్ కు సీనియ‌ర్ నేత రిజైన్

Leave A Reply

Your Email Id will not be published!