YS Jagan : ఏపీ అసెంబ్లీలో తొలి రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు అనుసరించిన పద్దతులు, వికృత చేష్టలు అత్యంత బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు.
రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ప్రసంగానికి అడ్డు పడడం దారుణమన్నారు. మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ వస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇదేం పద్దతి అంటూ ఫైర్ అయ్యారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడాన్ని ఎవరూ హర్షించరని పేర్కొన్నారు జగన్ రెడ్డి(YS Jagan).
ఏదైనా ప్రభుత్వం తయారు చేసిన బడ్జెట్ కు సంబంధించిన అంశాలకు అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలియ చేయాలని లేదా సభా సాక్షిగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
గవర్నర్ ప్రసంగ పాఠాల్ని చించి వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(YS Jagan). ఇదిలా ఉండగా సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.
గవర్నర్ ను వ్యక్తిగతంగా దూషించడం, స్పీచ్ ప్రతులను తెలుగు దేశం పార్టీ సభ్యులు చించి ఆయనపై విసిరి వేయడంపై బీఏసీ సమావేశంలో ఆ పార్టీకి చెందిన సభ్యుడు అచ్చెన్నాయుడిపై సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఏపీ చరిత్రలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదని అన్నారు. గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ వయసు రీత్యా పెద్ద వారని పేర్కొన్నారు.
ఇలాంటి కీలక సమయంలో హరిచందన్ పై ప్రతులు ఎలా విసిరి వేస్తారంటూ ప్రశ్నించారు సీఎం. ఇక నుంచి ఇలాగే ప్రవర్తిస్తే బాగుండదన్నారు.
Also Read : అన్ని రంగాల్లో ఏపీ ముందంజ