YS Jagan : ఏపీ సీఎం జగన్ రెడ్డి విద్యార్థుల పాలిట దేవుడిగా మారారు. ఆయన కొలువు తీరాక విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ విస్తరణ, వ్యవసాయ రంగాలపై ఎక్కువగా(YS Jagan) ఫోకస్ పెట్టారు.
ఆయన ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమం ఇవాళ దేశానికే ఆదర్శంగా మారింది. ఇప్పటికే కేంద్రం ఈ పథకం తీరు తెన్నులను పరిశీలించి ప్రశంసించింది.
విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రపంచంతో పోటీ పడాలన్న తలంపుతో విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందు కోసం ఆయన కొలువు తీరిన వెంటనే జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టారు.
ఇవాళ మరో అరుదైన ఘనత సాకారం కానుంది. రాష్ట్రంలోని 10 లక్షల 82 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏకంగా రూ. 709 కోట్లు జమ చేయనున్నారు.
ఆయన ఇవాళ తాడేపల్లిగూడెంలోని సచివాలయంలో బటన్ నొక్కడంతో డబ్బులు వారి ఖాతాల్లోకి రానున్నాయి. ఈ నిధులు జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసానికి సంబంధించినవి.
ఈ విద్యా దీవెన పథకం ముఖ్య ఉద్దేశం అర్హులైన పేద విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ . ఇందులో భాగంగా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ , మెడిసిన్ తదితర కోర్సులు చదివే వారదరికీ ప్రభుత్వమే భరిస్తుంది.
నిధులను సమకూరుస్తుంది. ఈ విద్యా దీవెన పథకం దేశంలో ఎక్కడా లేని రీతిలో అమలు చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం(YS Jagan) . ఈ పథకం వల్ల పిల్లలు చదువుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Also Read : డబ్బులు ఇవ్వండి రుణం తీర్చుకోండి