Jagannath Rath Yatra : ఘనం జగన్నాథ రథయాత్ర ఉత్సవం
తరలి వచ్చిన భక్త జనసందోహం
Jagannath Rath Yatra : ప్రతి ఏటా దేశంలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం బారులు తీరారు.
ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి జూన్ 30 గురువారం ఉదయం 10.49 నిమిషాలకు ప్రారంభమైంది జగన్నాథుని రథయాత్ర(Jagannath Rath Yatra). జూలై 1 శుక్రవారం వరకు సాగింది.
మూడు రథాలను కళ్లు చెదిరేలా తీర్చిదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రథ యాత్రకు పేరుంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతంలో కంటే ఈసారి భారీగా భక్తులు తరలి వచ్చారు.
పూరీ అంతటా శోభాయమానంగా, భక్తుల పారవశ్యంతో నిండి పోయింది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలతో కలిసి మూడు రథాలతో ప్రయాణించడం రథ యాత్రలోని అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
భారీగా ఈ మూడు రథాలు ఊరేగింపుగా వచ్చాయి. వీటిని తాకేందుకు, లాగేందుకు భక్తుల పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. భక్తులే కాకుండా ఇతర దేశాల నుంచి ఈ శోభయామాన జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు తరలి రావడం విశేషం.
గతంలో కరోనా కారణంగా ఇబ్బందులు ఏర్పడినా ఈసారి కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఊహంచని రీతిలో కంటే ఎక్కువగా భక్తులు తరలి వచ్చారు.
భగవంతుడు 14 రోజుల పాటు ఏకాంతంలో ఉన్న సమయంలో రథయాత్ర సాగుతుందని ఆచారం. ఆ సమయంలో దేవాలయాలన్నీ మూసి ఉంటాయి. ఇక విష్ణువు ప్రధాన అవతారాలలో జగన్నాథ శ్రీహరి ఒకరుగా భక్తులు భావిస్తారు.
Also Read : ‘రోబోటిక్’ రథయాత్ర హల్ చల్