Jagdeep Dhankar Rahul : రాహుల్ పై ధన్‌ఖర్ సీరియస్
మైక్రో ఫోన్ వ్యవహారంపై కామెంట్స్
Jagdeep Dhankar Rahul : భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖార్ సీరియస్ అయ్యారు. ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై భగ్గుమన్నారు. పార్లమెంట్ లో మైక్ లు ఆఫ్ చేయడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఏది చేసినా అది రూల్స్ కు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికారు ఉప రాష్ట్రపతి(Jagdeep Dhankar Rahul). కొంత ఎంపీలు అన్యాయంగా కించ పరిచేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ పార్లమెంటేరియన్ కరణ్ సింగ్ రాసిన పుస్తకాన్ని జగదీప్ ధన్ ఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లండన్ లో రాహుల్ గాంధీ తమ ప్రభుత్వంపై చేసిన దారుణమైన కామెంట్స్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. యావత్ ప్రపంచం ప్రస్తుతం భారత దేశంలో నెలకొన్న ప్రజాస్వామ్యం గురించి వాకబు చేస్తున్నారు.
ఇదే సమయంలో గొప్ప స్పూర్తిదాయకంగా కొనసాగుతుండడాన్ని చూసి విస్తు పోతున్నారు. కానీ మన దేశానికి చెందిన కొందరు మాత్రం పని గట్టుకుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఇది ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఇక నుంచి చేయకుండా ఉంటే బెటర్ అని పేర్కొన్నారు.
లోక్ సభలో పని చేసే మైక్రో ఫోన్ లు తరచుగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మౌనంగా ఉంటాయని రాహుల్ గాంధీ లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో ప్రస్తావించారు. ఈ కామెంట్స్ పై నిప్పులు చెరిగారు ధన్ ఖర్(Jagdeep Dhankar).
Also Read : ఆలయాల విధ్వంసంపై మోదీ ఆరా