Jagdeep Dhankar Sonia : సోనియా కామెంట్స్ సత్యదూరం
ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
Jagdeep Dhankar Sonia : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. న్యాయ వ్యవస్థపై మోదీ ప్రభుత్వం ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోందంటూ ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్. సోనియా గాంధీ తెలుసు కోకుండా ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ సత్య దూరమని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం ఎవరినీ కావాలని లేదా ఏ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు మరింత బలం చేకూర్చేందుకు సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు జగదీప్ ధన్ ఖర్(Jagdeep Dhankar). సోనియా గాంధీ చేసిన ప్రకటన లేదా ఆరోపణలు సత్య దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొలీజియం వ్యవస్థను తప్పు పట్టలేదని , కానీ ప్రధాన న్యాయమూర్తుల ఎంపిక చేసే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం పరిమితమైన పాత్ర ఉండడాన్ని మాత్రమే పదే పదే ప్రస్తావించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పదే పదే న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ వచ్చారు.
ప్రధానంగా బెయిళ్లకు సంబంధించిన పిటిషన్లను, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను విచారించడం వెంటనే నిలిపి వేయాలని కోరారు. దీనిపై పార్లమెంట్ లో పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది. ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి కేంద్ర సర్కార్ పై. కేంద్ర న్యాయ శాఖ మంత్రిపై కూడా.
కార్య నిర్వాహక్య వ్యవస్థకు న్యాయ వ్యవస్థకు మధ్య అగాధం ఏర్పడడం దేశానికి ప్రమాదమని ఇప్పటికే మాజీ చీఫ్ జస్టిస్ లోకూర్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీ చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : కాంగ్రెస్ లో లొల్లి దిగ్విజయ్ కు తలనొప్పి