Jagdeep Dhankar : కొలువు తీరనున్న జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్

ఎన్డీఏ ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ఘ‌న విజ‌యం

Jagdeep Dhankar : భార‌త దేశ 14వ ఉప రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఆగ‌స్టు 6న వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యారు. ప్ర‌తిప‌క్షానికి చెందిన మార్గరెట్ అల్వాను ఓడించి విజేత‌గా నిలిచారు.

గుజ‌రాత్ లోని ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగారు. లాయ‌ర్ గా ప‌ని చేశారు. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో మెంబ‌ర్ గా ఉన్నారు. సుప్రీంకోర్టులో కొంత కాలం పాటు న్యాయ‌వాదిగా ప‌ని చేశారు.

ఉప రాష్ట్ర‌ప‌తి కంటే ముందు జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేశారు. కొంత వివాదాస్ప‌దంగా మారారు. కానీ ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ధ‌న్ ఖ‌ర్ కు అత్యున్న‌త ప‌ద‌విని ఆఫ‌ర్ చేసింది.

ఇవాళ భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఉప రాష్ట్ర‌ప‌తిగా ఘ‌న విజ‌యం సాధించిన జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్(Jagdeep Dhankar) చేత ఉద‌యం 11.45 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ఆగ‌స్టు 7న ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ , ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అనుప్ చంద్ర పాండే సంయుక్తంగా భార‌త త‌దుప‌రి ఉప రాష్ట్ర‌ప‌తిగా ధన్ ఖ‌ర్ ఎన్నిక ధ్రువీక‌ర‌ణ‌పై సంత‌కం చేశారు.

జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ 74. 36 శాతం ఓట్ల‌ను సాధించారు. 1997 నుండి జ‌రిగిన చివ‌రి ఆరు ఉపాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆయ‌న అత్య‌ధిక విజ‌యాల ఆధిక్యాన్ని క‌లిగి ఉన్నారు.

మొత్తం 780 మంది ఓట‌ర్ల‌కు గాను 725 మంది ఓటు వేశారు. ఇందులో 15 ఓట్లు చెల్ల‌వ‌ని తేలింది. 92.94 శాతం పోలింగ్ న‌మోదైంది.

Also Read : విమాన ప్ర‌యాణీకుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!