Jagga Reddy : సిన్హాను వీహెచ్ కలిస్తే తప్పేంటి – జగ్గా రెడ్డి
రేవంత్ రెడ్డీ నువ్వో పోరగానివి
Jagga Reddy : ఉన్నట్టుండి జగ్గారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై. శనివారం విపక్షాల తరపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వీహెచ్ మర్యాద పూర్వకంగా కలిశారు.
తన మద్దతు తెలిపారు. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించాడు. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామంటూ మండిపడ్డారు. ఇది పిల్లలాట కాదని పార్టీ వ్యవహారమన్నారు.
మన ఇంటికి వస్తే మాట్లాడాలే తప్పా కేసీఆర్ పిలిస్తే వచ్చిన సిన్హాను ఎందుకు కలవాలని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై సీరియస్ అయ్యారు జగ్గారెడ్డి. సిన్హాను కలిస్తే తప్పేంటి అంటూ నిలదీశారు.
యశ్వంత్ సిన్హాకు బాజాప్తాగా కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు తెలిపిందని ఇందులో తప్పేంటంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీకి లేని అభ్యంతరం రేవంత్ రెడ్డికి ఎందుకని ప్రశ్నించారు.
సిన్హా నామినేషన్ రోజున రాహుల్ గాంధీ పక్కనే కేటీఆర్ కూడా ఉన్నారన్న సంగతి మరిచి పోతే ఎలా అన్నారు. మేం నీ కింత పని చేసే నౌకర్లం కాదని సంచలన కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి.
ఇంత కోపం ఉంటే పీసీసీకి పనికి రాడని తేల్చేశారు. పదవి లేక పోతే నీకు విలువే లేదని ఎద్దేవా చేశారు. ఇంట్లో కూర్చుంటే సరి పోతుందా. నువ్వో పోరగానివంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా జగ్గారెడ్డి(Jagga Reddy) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Also Read : మోదీ పీఎం కాదు ఓ సేల్స్ మెన్