S Jai Shankar : అమెరికా మీడియాపై జై శంకర్ గుస్సా
భారత్ దేశంపై కక్ష సాధింపు ధోరణి
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికా మీడియా అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యంగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లరు జైశంకర్(S Jai Shankar). ప్రతి దేశంతో సత్ సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తారు.
ఆయన ఎక్కడికి వెళ్లినా భారత్ తరపున శాంతి మంత్రం జపిస్తారు. కానీ ఉన్నట్టుండి జై శంకర్ కు కోపం రావడం విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా యుఎస్ మీడియా భారత దేశం పట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు.
కొన్ని గ్రూపులు, సంస్థలు భారత్ పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్నాయని పేర్కొన్నారు జై శంకర్. అటువంటి సమూహాలు బయట ప్రయత్నాలు చేస్తాయి. భారత దేశాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు జై శంకర్.
ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలని, ప్రసారం చేయాలని సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం, అవాస్తవాలకు ప్రయారిటీ ఇవ్వడం మానుకోవాలని కోరారు విదేశాంగ శాఖ మంత్రి(S Jai Shankar).
ఏ ప్రసార మాధ్యమమైనా తమ పరిమితులు తెలుసుకుని నడుచు కోవాలన్నారు. ప్రధానంగా యుఎస్ మీడియా పక్షపాత ధోరణిని ఖండించారు.
అభివృద్ది చెందుతున్న దేశాల సరసన భారత్ ఉందని, యావత్ ప్రపంచంలోని టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న వారిలో భారతీయులే ఉన్నారని మరిచి పోవద్దని ఈ సందర్భంగా స్పష్టం చేశారు జై శంకర్.
వాసింగ్టన్ పోస్ట్, టైమ్స్ తదితర మీడియా సంస్థలు భారత్ పట్ల వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నాయని ప్రస్తావించారు.
Also Read : ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం