Jai Shankar : సంగీతం వ‌ల్లే ఈ స్థాయిలో ఉన్నా

హార్వ‌ర్డ్ విద్యార్థుల‌తో జై శంక‌ర్

Jai Shankar :  భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం భార‌త్ అనుస‌రిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్ర‌శంసిస్తోంది.

ఈ త‌రుణంలో ఆయ‌న ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో క‌లిసి అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ విద్యార్థుల‌తో జై శంక‌ర్ (Jai Shankar) సమావేశం అయ్యారు.

ఇందులో భాగంగా విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానం ఇచ్చారు. మీ విజ‌యానికి కార‌ణం ఏమిటి అన్న ప్ర‌శ్న‌కు ఊహించ‌ని రీతిలో తెలిపారు.

సంగీతం అంటే త‌న‌కు ప్రాణ‌మ‌ని, అందులో లీనం కావ‌డం వ‌ల్లే తాను ఎంతో నేర్చుకోగ‌లిగాన‌ని చెప్పారు. అదే త‌న విజ‌యానికి మూల‌మ‌ని, త‌న‌ను ఇంత‌టి వాడిని చేసిందని చెప్పారు.

ప్ర‌పంచంపై ఆస‌క్తి పెరిగింద‌న్నాడు. మ్యూజిక్ లో మ్యాజిక్ చేసే స‌త్తా ఉంద‌న్నారు జై శంక‌ర్(Jai Shankar). విదేశాంగ శాఖ మంత్రిగా ఎన్నో వ‌త్తిళ్లు ఉంటాయ‌ని, ఇది ఒక ర‌కంగా జీవితంలో స‌వాల్ తో కూడుకున్న ప‌ద‌వి అని చెప్పారు.

అంత‌ర్జాతీయ సంబంధాల‌పై మీ అంద‌రికీ ఆస‌క్తి క‌లిగించింది ఏంటి అన్న ఓ విద్యార్థిని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. సంగీతం త‌న‌ను సంతోషంగా ఉంచేలా చేస్తుంద‌న్నారు జై శంక‌ర్.

ఈ స‌మ‌స్త ప్ర‌పంచం ప‌ట్ల ఎరుక క‌లిగి ఉండేలా చేసింది మాత్రం మ్యూజిక్ మాత్ర‌మేన‌ని చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొన్నారు విదేశాంగ శాఖ మంత్రి. ఆహారం తీసుకోవాలంటే ఖ‌ర్చ‌వుతుంది. కానీ సంగీతాన్ని ఆస్వాదించాలంటే ఎలాంటి ఖ‌ర్చు చేయాల్సిన ప‌ని లేద‌న్నారు.

Also Read : ఉగ్ర‌వాదంపై ఉక్కు పాదం మోపాలి

Leave A Reply

Your Email Id will not be published!