Jai Shankar : ఉక్రెయిన్ , రష్యా యుద్దం గురించి ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారత్ అనేక ప్రకటనలు చేసిందని స్పష్టం చేశారు భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar).
యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన అమెరికా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పరిమితులు ఏమిటో తమకు తెలుసని స్పష్టం చేశారు.
తాము మధ్యేవాద మార్గాన్ని అనుసరిస్తున్నామని, తాము ఎవరితో యుద్దం కోరుకోవడం లేదన్నారు. భారత దేశం ముందు నుంచీ గిల్లి కజ్జాలు పెట్టుకోదన్నారు.
శాంతి తమ అభిమతమని కానీ కాదని ఒకవేళ కయ్యానికి కాలు దువ్వితే బదులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు.
ఇక రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే దానిపై అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ చేసిన ఒత్తిళ్లను తాము పట్టించు కోబోబమంటూ కుండబద్దలు కొట్టారు.
ఈ సందర్భంగా జై శంకర్ (Jai Shankar)పదునైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఐరోపా దేశాల కంటే తాము తక్కువ తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ప్రస్తుతం జై శంకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒక రకంగా మీరు రష్యా నుండి ఇంధన కొనుగోళ్లను చూస్తున్నట్లయితే మీ దృష్టిని యూరప్ పై కేంద్రీకరించాలని సూచిస్తున్నా. తాము ఇంధన భద్రతకు అవసరమైన కొంత శక్తిని కొనుగోలు చేస్తామన్నారు.
తాము చేసిన కొనుగోళ్లు యూరప్ చేసిన దానికంటే తక్కువ అని కుండబద్దలు కొట్టారు. ఇదిలా ఉండగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది జై శంకర్ ఇచ్చిన రిప్లైని ప్రశంసించింది.
Also Read : పాకిస్తాన్ కు రానున్న నవాజ్ షరీఫ్