Jailer Kaavaala Song : త‌లైవా జైల‌ర్ సాంగ్ రికార్డ్

వ్యూయ‌ర్షిప్ లో టాప్

Jailer Kaavaala Song : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ త‌లైవా ర‌జ‌నీకాంత్ , ల‌వ్లీ గ‌ర్ల్ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే జైల‌ర్ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ , సాంగ్ కు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా కావాలా పేరుతో రిలీజ్ చేసిన పాట(Jailer Kaavaala Song) దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర సంగీతం అందించాడు. శిల్పా రావుతో క‌లిసి కావాలా పాట‌ను పాడాడు అనిరుధ్. సంగీత నైపుణ్యాల‌ను తారా స్థాయికి తీసుకు వెళ్లేలా చేశాడు. ఈ పాట‌ను చూసిన వారంతా డ్యాన్స్ చేసేందుకు తెగ ముచ్చ‌ట ప‌డుతున్నారు. త‌మ‌న్నా భాటియా తో పాటు త‌లైవా ర‌జ‌నీకాంత్ పోటీ ప‌డి న‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ పండింది.

ఇదిలా ఉండ‌గా జైల‌ర్ మూవీలోని కావాలా సాంగ్ కు జానీ మాస్ట‌ర్ కొరియో గ్ర‌ఫీ అందించారు. ఇక చిత్రానికి సంబంధించి సాంగ్ రిలీజ్ అయిన వెంట‌నే పెద్ద ఎత్తున ఆద‌రిస్తున్నారు ఫ్యాన్స్. ఇక జైల‌ర్ చిత్రంలో ర‌జ‌నీకాంత్ తో పాటు త‌మ‌న్నా భాటియా, ర‌మ్య కృష్ణ‌న్ , యోగి బాబు, వ‌సంత్ ర‌వి, వినాయ‌క‌న్ , ఇత‌రులు న‌టించారు. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కూడా న‌టిస్తుండ‌డం విశేషం.

Also Read : Mahankali Bonalu Jatara : మ‌హంకాళి బోనాల జాత‌ర షురూ

Leave A Reply

Your Email Id will not be published!