Jairam Ramesh Gogoi : బీజేపీవి ఎజెండా లేని సమావేశాలు
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ
Jairam Ramesh Gogoi : వర్షాకాల సమావేశాలు ముగిశాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎజెండా లేని పార్లమెంట్ సమావేశాలను బహిర్గతం చేశామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
ఉభయ సభలలో ముఖ్యమైన సమస్యలను లేవనెత్తడం లేదని నిందించింది. నిర్ణీత తేదీకి నాలుగు రోజుల ముందు వర్షాకాల సమావేశాన్ని ముగించడం ద్వారా బీజేపీ పారిపోయిందంటూ అని గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆరోపించింది.
రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఉద్వేగ భరితంగా వీడ్కోలు పలికి పార్లమెంట ను వాయిదా వేయడం గమనార్హం.
ఈ సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జీ జైరాం రమేశ్ , ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ నిరుద్యోగ సమస్యను, దాని తర్వాత అగ్ని పథ్ పథకాన్ని ప్రవేశ పెట్టాలని కోరుకున్నామని అన్నారు.
సరిహద్దు వివాదాలపై భారత్, చైనాల మధ్య దాదాపు 16 సార్లు సమావేశాలు జరిగాయన్నారు. ఇవాళ భారత సైన్యం సరిహద్దు వెంట గస్తీ ని ఏర్పాటు చేయలేక పోయిందన్నారు.
ఇలాంటి ప్రధానమైన సమస్యలను ప్రస్తావించనీయకుండా, చర్చించకుండా బీజేపీ తప్పించు కోవాలని అనుకుందన్నారు. ధరల పెరుగుదలపై కేంద్ర సర్కార్ వద్ద సరైన సమాధానం లేదన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉక్రెయిన్ , బంగ్లాదేశ్, శ్రీలంక సంక్షోభాల గురించి మాట్లాడారు. కానీ ఆమె కేంద్ర సర్కార్ ఎందుకు ధరలు పెంచిందనే దానిపై జవాబు చెప్పకుండా దాట వేశారంటూ ఆరోపించారు జైరాం రమేశ్, గొగోయ్(Jairam Ramesh Gogoi).
ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : గవర్నర్ ను కలవనున్న నితీష్ కుమార్