Jairam Ramesh : ‘ఒకే దేశం ఒకే పాలు’ ఒప్పుకోం

బీజేపీపై నిప్పులు చెరిగిన జైరాం ర‌మేష్

Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్(Jairam Ramesh)  నిప్పులు చెరిగారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంలో ముందంజ‌లో ఉంద‌ని ఆరోపించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే మతం పేరుతో విద్వేషాలు రెచ్చ గొడుతోంద‌ని , ఇదే స‌మ‌యంలో ఒకే దేశం ఒకే పాలు నినాదాన్ని తీసుకు వ‌స్తోంద‌ని ఆరోపించారు. అమూల్ , నందిని రెండూ శ్వేత విప్ల‌వం జాతీయ విజ‌య‌గాధ‌లు అని పేర‌కొన్నారు.

రాష్ట్రాల్లోని డెయిర్ కో ఆప‌రేటివ్ ల‌ను బీజేపీ నియంత్రిస్తోంద‌ని మండిప‌డ్డారు. తాజాగా క‌ర్ణాట‌క‌లో నందిని పేరుతో పాల ప‌దార్థాలు కొన‌సాగుతున్నాయి. ఇక్క‌డ గుజ‌రాత్ కు చెందిన అమూల్ ను ప్రారంభించాల‌ని బీజేపీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఇప్ప‌టికే రాష్ట్రానికి సంబంధించిన అన్నింటిని దోచుకున్నార‌ని ఇక క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కు నందిని మిల్క్ ను దూరం చేస్తామంటే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్.

కోట్లాది మంది పాడి రైతుల‌కు స్వ‌యం ప్ర‌తిప‌త్తిని క‌ల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ స‌హాయ ప‌డింద‌ని కానీ ఇప్పుడు వాటిపై కూడా బీజేపీ క‌న్ను ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : న‌న్ను మ‌న్నించండి క్ష‌మించండి

Leave A Reply

Your Email Id will not be published!