Jairam Ramesh Polls : వాళ్లు ఎన్నికలను నియంత్రించ లేరు
జార్జ్ సోరోస్ కామెంట్స్ పై జైరాం రమేష్
Jairam Ramesh Polls : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రముఖ బిలీయనీర్ జార్జ్ సోరోస్ సంచలన ఆరోపణలు చేశారు భారత్ పై. ప్రధానంగా అదానీ గ్రూప్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. కొందరు కావాలని భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ తరుణంలో జైరాం రమేష్(Jairam Ramesh Polls) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జార్జ్ సోరోస్ లేదా ఇతర వ్యాపారవేత్తలు భారత ఎన్నికల ఫలితాలను నిర్ణయించ లేర్నారు. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని చుట్టుముట్టిన గందర గోళం దేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి తలుపులు తెరిచే అవకాశం ఉందని జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
అదానీ సమస్య దేశంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి దారి తీస్తుందా లేదా అనేది పూర్తిగా ప్రతిపక్ష పార్టీలపై ఆధారపడి ఉందన్నారు. కానీ దీనికి బిలియనీర్ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ తో సంబంధం లేదని స్పష్టం చేశారు జైరాం రమేష్. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఇదిలా ఉండగా జార్జ్ సోరోస్ ఒక్క తమ ప్రభుత్వమైనే కాకుండా యావత్ భారత దేశాన్ని టార్గెట్ చేశాడంటూ బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ వ్యవహారంపై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత దాని షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి.
Also Read : సోరోస్ కామెంట్స్ స్మృతీ సీరియస్