Jairam Ramesh : లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు
జైరాం రమేష్ షాకింగ్ కామెంట్స్
Jairam Ramesh : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , మీడియా ఇంఛార్జి జైరాం రమేష్. రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర సోమవారంతో ముగిసింది. ఇవాల్టి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మధ్య ప్రదేశ్ కు చేరుకుంటుంది.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో యాత్రలో పాల్గొన్న జైరాం రమేష్(Jairam Ramesh) మీడియాతో మాట్లాడారు. ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండాల్సిందేనని గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆయన కోమటిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు విపరీతమైన స్పందన వస్తోందన్నారు.
దీనిని చూసి భారతీయ జనతా పార్టీలో బుగులు మొదలైందన్నారు. చిన్నారుల నుండి వృద్దుల దాకా అన్ని వర్గాలకు చెందిన రాహుల్ యాత్రలో పాల్గొంటున్నారని ఇది తమ పార్టీకి మరింత జోష్ తెప్పిస్తోందని చెప్పారు జైరాం రమేష్. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 రోజుల పాటు యాత్ర కొనసాగిందన్నారు.
మొత్తం 8 జిల్లాల్లో 319 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరిగిందని వెల్లడించారు. నేటితో దక్షిణ భారత దేశ పాదయాత్ర ముగిసిందన్నారు. ఇక మహారాష్ట్రలో మొదలై మధ్యప్రదేశ్ లోకి ప్రవేశిస్తుందన్నారు. మొత్తం 3,578 కిలోమీటర్ల మేరకు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రధాన మంత్రి సొల్లు కబుర్లు చెప్పే మన్ కీ బాత్ కార్యక్రమం కాదని ప్రజలు స్వతహాగా రాహుల్ గాంధీతో చెప్పుకునే పాదయాత్ర ఇదని పేర్కొన్నారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాక పోవడంపై సమీక్షిస్తామన్నారు. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆరోపించారు.
Also Read : మా పంతం కుటుంబ పాలన అంతం