Jairam Ramesh : కరోనా లేఖలు ‘కాషాయాని’కి వర్తించవా – జైరాం
మంత్రి మన్సుఖ్ కు రమేష్ సూటి ప్రశ్న
Jairam Ramesh : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్ నిప్పులు చెరిగారు. కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీ తో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు లేఖలు రాశారు. కరోనా కారణంగా రూల్స్ పాటించాలని, ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే భారత్ జోడో యాత్రను నిలిపి వేయాలని స్పష్టం చేశారు.
దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయంగా ఒకరిపై మకొరు ఆరోపణలు చేసుకున్నారు. కరోనా రూల్స్ కేవలం ప్రతిపక్షాలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తాయా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలకు వర్తించవా అని నిలదీశారు జైరాం రమేష్.
ప్రస్తుతం రాహుల్ చేపట్టిన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో పూర్తయింది. ప్రస్తుతం హర్యానాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మన్సుఖ్ లేఖలు రాయడం కలకలం రేపింది.
ఢిల్లీలో జరిగే జోడో యాత్రలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ పాల్గొంటారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరోనా రూల్స్ అనుసరించడం సాధ్యం కాక పోతే యాత్రను నిలిపి వేయడాన్ని పరిగణించాలని సూచించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జైరాం రమేష్(Jairam Ramesh).
ఇదే క్రమంలో ర్యాలీలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులకు లేఖలు రాశారా అని ప్రశ్నించారు.
ఇదంతా కేవలం రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఇలా లేఖలు రాశారంటూ మండిపడ్డారు.
Also Read : కరోనా పేరుతో రాహుల్ యాత్రకు అడ్డుకట్ట