SIA Siezed : రూ. 90 కోట్ల విలువైన ‘జమాత్ ఇస్లామీ’ ఆస్తులు సీజ్
జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర సర్కార్ నిషేధం
SIA Siezed : జమ్మూ కాశ్మీర్ లో నిషేధిత గ్రూప్ జమాత్ – ఎ – ఇస్లామీపై ఉక్కుపాదం మోపింది కేంద్ర సర్కార్. ఇందులో భాగంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 90 కోట్ల విలువ చేసే జమాత్ – ఎ – ఇస్లామీకి చెందిన దాదాపు 200 ఆస్తులను జప్తు(SIA Siezed) చేసింది.
ఈ మేరకు ఆయా గుర్తించిన ఆస్తుల వద్ద ఎంట్రీ వినియోగాన్ని పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేయడం విస్తు పోయేలా చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో నిషేధిత ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్ ఎ ఇస్లామీకి చెందిన భారీ విలువైన 11 ప్రధాన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐఏ ప్రకటించింది.
ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. ఇందుకు సంబంధించి వాస్తవమేనని పేర్కొంది. రాడికాలిజం, వేర్పాటువాదం, తీవ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తోందని స్పష్టం చేసింది ఎస్ఐఏ. ఇప్పటికే పలు చోట్ల సోదాలు జరిపినట్లు పేర్కొంది. జమాత్ ఎ ఇస్లామీకి చెందిన రెండు పాఠశాల భవనాలతో సహా మరో తొమ్మిది ఆస్తులకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించింది.
కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా ప్రకారం ఆస్తులను జిల్లా మేజిస్ట్రేట్ నోటిఫై చేశారు. అనంత నాగ్ జిల్లా మేజిస్ట్రేట్ నుండి ఆర్డర్ పొందిన తర్వాత ఎస్ఐఏ(SIA Siezed) అధికారులు భారీ పోలీసు బలగాలతో కలిసి 11 ఆస్తులపై దాడి చేశారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆయా ఆస్తుల వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐఏ బ్యానర్లు కూడా ఏర్పాటు చేసింది. కాగా జమాత్ ఇ ఇస్లామీ జమ్మూ, కాశ్మీర్ లో అతి పెద్ద రాజకీయ మత సంస్థగా పేరొందింది.
Also Read : బడ్జెట్ తయారీకి సూచనలు ఇవ్వండి