Jana Reddy : ఫోర్ మెన్ క‌మిటీ చీఫ్ గా జానా

అప్పగించిన ఏఐసీసీ

Jana Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న భారత రాష్ట్ర స‌మితి పార్టీ అన్ని పార్టీల కంటే ముందంజ‌లో ఉంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్. ఏడుగురికి మొండి చేయి చూపించారు.

Jana Reddy got a Senior Position

ఈ స‌మ‌యంలో ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇటీవ‌లే క‌ర్ణాట‌క‌లో బీజేపీకి షాక్ ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చింది హ‌స్తం. దీంతో ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది.

పార్టీ ప‌రంగా ఇంకా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌లేదు. స్క్రీనింగ్ క‌మిటీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేసింది. చాలా చోట్ల ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నారు. దీంతో అసంతృప్తులు పెరిగి పోవ‌డాన్ని గ‌మ‌నించింది పార్టీ హై క‌మాండ్.

ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మాజీ మంత్రి , పార్టీ సీనియ‌ర్ నేత కందూరు జానా రెడ్డికి(Jana Reddy) హై క‌మాండ్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. సీట్ల స‌ర్దుబాటు , నేత‌ల మ‌ధ్య స‌యోధ్య కోసం జానా నేతృత్వంలో ఫోర్ మెన్ క‌మిటీని ఏర్పాటు చేసింది.

ఈ క‌మిటీలో జానా రెడ్డి, మాణిక్రావు ఠాక్రే, దీప దాస్ మున్షీ, మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో క‌మిటీని ఏర్పాటు చేసింది. టికెట్ల త‌ర్వాత అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే బాధ్య‌త అప్ప‌గించింది.

Also Read : CM KCR Viral : సీఎం కేసీఆర్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!