Jana Reddy : జానా రెడ్డి జాన్తా నై

నోరు పారేసుకున్న మాజీ మంత్రి

Jana Reddy : తెలంగాణ – ఇంకా ప‌వ‌ర్ లోకి రానే లేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు నోరు పారేసుకుంటున్నారు. స్థాయిని మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రుల‌మై పోయిన‌ట్లు, సీఎం కాబోతున్న‌ట్లు త‌మ‌ను తాము ఊహించు కుంటున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతకాలు ప్రాక్టీస్ చేస్తున్నారు.

Jana Reddy Comments Viral

మ‌రో వైపు సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి(Jana Reddy) గీత దాటారు.
ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌మావేశంలో త‌న‌ను ప్ర‌శ్నించిన వారిపై మండిప‌డ్డారు. తిట్ల దండ‌కం అందుకున్నారు. కుల దుర‌హంకారం ఇందులో క‌నిపించింది.

జానా రెడ్డి నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో జానాను ఇంటికి పంపించార‌ని , ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌ల్లో వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌శ్నించిన గిరిజ‌నుల‌ను స్టేజి మీదే తిట్ల దండ‌కం అందుకోవ‌డంపై భ‌గ్గుమ‌న్నారు. నీకు త‌గిన శాస్తి జ‌రుగుతుంద‌ని శాప‌నార్థాలు పెట్టారు. ఇదిలా ఉండ‌గా వ‌ద్ద‌ని వారించిన కొడుకుపై కూడా ఫైర్ అయ్యారు కందూరు జానా రెడ్డి. నీకు అనుభ‌వం లేదు..వీళ్ల‌తో ఇలాగే మాట్లాడాలంటూ చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : AP DGP : లేఖ వ్య‌వ‌హారం విచార‌ణ‌కు ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!