Janardhan Reddy : జనార్దన్ రెడ్డిని ఎలా వదిలేస్తారు
సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్
Janardhan Reddy : హైదరాబాద్ – లక్షలాది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేస్తే ఊరుకుంటారా అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమీక్ష చేపట్టారు. ఇంకా సభ్యులు రాజీనామా చేయాల్సి ఉంది. గతంలో కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అవినీతి, అక్రమాలకు అడ్డగా మార్చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షా పేపర్లను అమ్ముకోవడం, ఆపై కోర్టుల్లో కేసులు వేయడం, తిరిగి తమ వారికి ఉద్యోగాలు కట్టబెట్టేలా చేయడం పరిపాటిగా మారింది.
Janardhan Reddy Viral
సిట్ కూడా ఏర్పాటు చేసింది గత సర్కార్. 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించిన జనార్దన్ రెడ్డి తాను నిజాయితీపరుడినని చిలుక పలుకులు పలికారు. కానీ గతంలో ఇదే సంస్థకు చైర్మన్ గా వ్యవహరించిన ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్ తదితరులపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
జనార్దన్ రెడ్డి కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా ఏ ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించిన పాపాన పోలేదు. చైర్మన్ పై విచారణ జరపకుండా ఎలా వదిలి వేస్తారంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో నిర్వహించిన పరీక్షల మాటేంటి అన్నది సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
Also Read : Nara Lokesh : బాబు పవన్ జోడి బ్లాక్ బస్టర్