MLC Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పై జనసేన నాయకుల ఫిర్యాదులు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పై జనసేన నాయకుల ఫిర్యాదులు

MLC Duvvada Srinivas : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరియు అతని కుటుంబ సభ్యులను ఉద్దేశ్యించి గత వైసీపీ ప్రభుత్వంలో దుర్భాషలాడిన ఒక్కొక్కరిపై టీడీపీ, జనసేన నాయకులు ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు. దీనితో టీడీపీ, జనసేన నాయకుల పిర్యాదుల మేరకు ఇప్పటికే బోరుగడ్డ అనిల్ కుమార్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళీలను అరెస్ట్ చేసిన పోలీసులు… విచారణ పేరుతో వారిని వివిధ పోలీసు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. పోసాని కృష్ణమురళీకు మొత్తం నాలుగు కోర్టుల్లో కూడా మంగళవారం బెయిల్ మంజూరు కావడంతో… బుధవారం అతను జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నెక్ట్స్ టార్గెట్ ఎవరా అని అందరూ ఆలోచించే లోపే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada Srinivas) పై జనసేన నాయకులు పిర్యాదులు చేస్తున్నారు.

MLC Duvvada Srinivas Case

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌(MLC Duvvada Srinivas) పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశం ప్రారంభ సమయంలో దువ్వాడ… డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పవన్ కుటుంబానికి సంబంధించి కామెంట్స్ చేశారు. పవన్‌పై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దువ్వాడ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం రూరల్ పోలీస్‌స్టేసన్‌‌లో దువ్వాడపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీలను పోలీసులకు స్వీకరించారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయనట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు కాపీ పంపించిన అనంతరం వారు సూచనల మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

అయితే వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిపై కేసులు నమోదు అవడమే కాకుండా వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల మాటల ప్రవాహం ఏ మాత్రం తగ్గడం లేదు. డిప్యూటీ సీఎం పవన్‌పై దువ్వాడ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీకి వచ్చే ముందు పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ. చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ నెలకు రూ.50 కోట్లు తీసుకుంటున్నారని, అందుకే ఆయన శాసనసభలో కనిపించడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలను జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదు అయ్యాయి. పవన్‌ కళ్యాణ్‌ పై దువ్వాడ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముందుగా గుంటూరులోని పాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అలాగే విజయనగరంలో కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అవనిగడ్డ, మచిలీపట్నం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏ క్షమణమైన దువ్వాడ అరెస్ట్ తప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read : Posani Krishna Murali: పోసానికి బిగ్ రిలీఫ్ నాలుగు కేసుల్లోనూ బెయిల్ మంజూరు

Leave A Reply

Your Email Id will not be published!