Janasena Party Meeting : 9న ఏలూరులో జ‌న‌సేన స‌భ

రెండో విడ‌త వారాహి యాత్ర

Janasena Party Meeting : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ కళ్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తొలి విడ‌త వారాహి విజ‌య యాత్ర ముగిసింది. రెండో విడ‌త వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేర‌కు కీల‌క స‌మావేశం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన ఏలూరులో భారీ బ‌హిరంగ స‌భ చేప‌ట్ట‌నున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుక్ర‌వారం ఏలూరు బైపాస్ రోడ్డు లోని ఎస్వీ రంగారావు విగ్ర‌హం వ‌ద్ద ఆహ్వానం ప‌లికారు జ‌న‌సైనికులు. సాయంత్రం వ‌ర‌కు క్రాంతి క‌ళ్యాణ మండ‌పంలో జ‌న‌సేనాని బ‌స చేశారు. సాయంత్రం 5 గంట‌ల నుండి ఏలూరు రోడ్డు నుండి జూట్ మిల్ , ఫైర్ స్టేష‌న్ , అశోక్ న‌గ‌ర్ , డీ మార్ట్ , ఆదివారపు పేట మీదుగా పాత బ‌స్టాండ్ అంబేద్క‌ర్ వ‌ర‌కు భారీ ర్యాలీ చేప‌ట్టారు.

ఏలూరు జిల్లా వ్యాప్తాంగా ఉన్న జన సేన(Janasena) పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీగా పాల్గొననున్నార‌ని పార్టీ వెల్ల‌డించింది. పోలీసుల నుండి, మున్సిప‌ల్ అధికారుల నుండి అన్ని అనుమతులు తీసుకుంటున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా ఏలూరు నియోజ‌క‌వ‌ర్గ జ‌న సేన ఇంఛార్జ్ రెడ్డి అప్ప‌ల నాయుడు పాల్గొన్నారు. పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరులో నిర్వ‌హించే స‌భ‌కు సంబంధించి పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ తో చ‌ర్చించారు.

Also Read : TTD Chairman : ఎస్వీబీసీ ఛాన‌ల్ కు ప్ర‌పంచ గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!