Janasena Party : అంద‌రి చూపు జ‌న‌సేన వైపు

ఆంక్ష‌ల న‌డుమ ఆవిర్భావ స‌భ

Janasena Party Pawan Kalyan : అంద‌రి చూపు జ‌న‌సేన వైపు చూస్తోంది. ఇవాళ కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో 10వ ఆవిర్భావ స‌భ జ‌రుగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే ఎలాంటి ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌కు వీలు లేదంటూ స్ప‌ష్టం చేశారు ఎస్పీ జాషువా. దీంతో ఆంక్ష‌ల న‌డుమ స‌భ కొన‌సాగ‌నుంది. అన్నీ తానై చూసుకుంటున్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

ఆయ‌నకు అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఇక పార్టీ ప‌రంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా త‌మ్మిరెడ్డి శివ‌శంక‌ర్ రావు , పార్ల‌మెంట‌రీ చైర్ ప‌ర్స‌న్ గా మ‌హేంద‌ర్ రెడ్డి ఉన్నారు. వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా, పార్టీ చీఫ్ గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Janasena Party Pawan Kalyan) ఉన్నారు.

హైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా స‌రిగ్గా ఇదే రోజు మార్చి 14, 2014లో జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేశారు. విద్యుత్ విభాగానికి భ‌గ‌త్ సింగ్ స్టూడెంట్ యూనియ‌న్ అని పేరు పెట్టారు. యువ‌జ‌న విభాగానికి ఆజాద్ యువ‌సేన విభాగం, మ‌హిళా విభాగానికి ఝాన్సీ వీర మ‌హిళా విభాగం ఏర్పాటు చేశారు. టీ గ్లాసును జ‌న‌సేన పార్టీ గుర్తు కేటాంచింది ఈసీ. దీనికి ఇంగ్లీష్ లో పీపుల్స్ ఆర్మీ అని పిలుచుకుంటారు.

ఆనాడు మార్చి 14న మాదాపూర్ లోని హైటెక్ లో భారీ స‌మావేశం ఏర్పాటు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్( Pawan Kalyan). త‌ర్వాతి స‌భ‌ను వైజాగ్ లో చేప‌ట్టారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ఇజం పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. డిసెంబ‌ర్ 11, 2014న పార్టీని ఆమోదించింది. ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నంలో జ‌రిగే ఆవిర్భావ స‌భ‌పై అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈసారి జ‌రిగే ఎన్నికల్లో స‌త్తా చాటాల‌ని చూస్తోంది జ‌న‌సేన‌. ఈ మేర‌కు భారీ ఏర్పాట్లు చేసింది.

Also Read : జ‌న‌సేన ఆవిర్భావ స‌భ

Leave A Reply

Your Email Id will not be published!