Janmabhoomi Express: ప్రయాణికులకు గుడ్న్యూస్ ! జన్మభూమి ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ !
ప్రయాణికులకు గుడ్న్యూస్ ! జన్మభూమి ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ !
Janmabhoomi Express: విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన రైళ్లలో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ వంటిరైళ్లు ఉన్నాయి. దీనితో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.
Janmabhoomi Express…
ఈ క్రమంలో విశాఖ- లింగంపల్లి (12805) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ను జూన్ 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనితో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు (17257); చెంగల్పట్టు- కాకినాడ పోర్ట్ (17643) మధ్య నడిచే రైళ్లను సైతం పునరుద్ధరించినట్లు పేర్కొంది. వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు ప్రత్యేక రైళ్లను మరింత కాలం పాటు నడపునున్నట్లు వెల్లడించింది.
Also Read : CM Revanth Reddy: రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ !