Powerful Passports : శక్తివంతమైన పాస్ పోర్ట్ లలో జపాన్ టాప్
భారత దేశం 87..చైనా 69 వ స్థానం
Powerful Passports : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు జారీ చేసే పాస్ పోర్ట్ లలో ఏవి శక్తివంతమైనవనే దానిపై జాబితా విడుదలైంది. జపాన్, సింగపూర్ , దక్షిణ కొరియా టాప్ లో ఉన్నాయి.
80 దేశాలకు యాక్సెస్ తో చైనా 69 వ స్థానంలో ఉంది. ఇక భారత దేశం 87వ స్థానంలో నిలిచింది. ఆఫ్గనిస్తాన్ పాస్ పోర్ట్ తక్కువ ఉపయోగకరంగా ఉందని తేలింది.
ఈ ఏడాది 2022కి సంబంధించి బ్లూమ్ బెర్గ్ ఈ జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్(Powerful Passports) ల జారీలో జపనీస్ టాప్ లో నిలిచింది.
ఆ దేశానికి చెందిన పాస్ పోర్ట్ తో 193 దేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తోంది. కరోనా లో సైతం ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
యూరోపియన్ దేశాల ఆధిపత్యాన్ని అధిగమిస్తూ జపాన్ టాప్ లో (Japan Top) నిలవడం విశేషం. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ అండ్ పార్ట్ నర్స్ నుండి తాజాగా పాస్ పోర్ట్ ఇండెక్స్ ను తయారు చేసింది.
సింగపూర్ , దక్షిణ కొరియా దేశాల కంటే జపాన్ పాస్ పోర్ట్ తో ఈజీగా ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుందట. రష్యన్ జారీ చేసే పాస్ పోర్ట్ 50 వ స్థానంలో నిలిచింది.
ఇది 119 దేశాలకు సులభంగా వెళ్లేందుకు దోహద పడుతోంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే భారత దేశం విచిత్రంగా 87వ స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రంచంలో అత్యధికంగా ఆమోదించ బడని 10 పాస్ పోర్ట్ లలో ఆసియా దేశాలు కనిపించ లేదు. యుకె 187 దేవాలకు యాక్సెస్ తో ఆరో స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 186 స్కోర్ తో ఏడో స్థానంలో ఉంది.
Also Read : ఇండియాను హిందూ దేశంగా ప్రకటించాలి