Jasprit Bumrah : తిప్పేసిన జస్ప్రీత్ బుమ్రా
4 ఓవర్లు 10 పరుగులు 5 వికెట్లు
Jasprit Bumrah : భారతీయ క్రికెట్ లో టాప్ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో బుమ్రా మ్యాజిక్ చేశాడు. తన బౌలింగ్ దెబ్బతో కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించాడు.
కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన బుమ్రా(Jasprit Bumrah) 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు కూల్చాడు. ఇప్పటి వరకు ఈసారి ఐపీఎల్ మరో ఇద్దరు బౌలర్లు ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు.
ఒకరు సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ కాగా మరొకరు ఆర్సీబీకి చెందిన హసరంగా. ఉమ్రాన్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఇక వనిందు హసరంగా 4 ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా కేకేఆర్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 165 రన్స్ చేసింది. బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 113 పరుగులకే చాప చుట్టేసింది.
బుమ్రా పూర్తి పేరు జస్ప్రీత్ జస్పీర్ సింగ్ బుమ్రా(Jasprit Bumrah). 6 డిసెంబరర్ 1993లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టాడు. వయసు 28 ఏళ్లు. ఇతడిని జేపీ అని, జస్సీ అని కూడా పిలుచుకుంటారు అభిమానులు. 2016 నంచి ఆడుతున్నాడు.
6 జనవరి 2018న దక్షిణాఫ్రికాపై టెస్టు సీరీస్ రంగ ప్రవేశం చేశాడు. చివరి టెస్టు 12 మార్చి 2022న శ్రీలంతో ఆడాడు. 23 జనవరి 2016లో ఆస్ట్రేలియాపై వన్డే లో ఆడాడు.
టీ20ని 26 జనవరి 2016లో ఆడాడు. క్యాలెండర్ ఇయర్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా టెస్టు ఇన్నింగ్స్ లోలో 5 వికెట్లు తీసిన ఆసియా బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read : మారని ముంబై గెలిచిన కోల్ కతా