Jay Shah Comment : ‘జే షా’ బీసీసీఐకి బాద్ షా

బాస్ బిన్నీ ఉన్నా లేన‌ట్టే

Jay Shah Comment : ప్ర‌పంచ క్రికెట్ రంగాన్ని ఐసీసీ శాసిస్తే ఐసిసీని బీసీసీఐ శాసిస్తోంది. ఇవాళ భార‌త దేశంలో క్రికెట్ అంటే ఓ మ‌తం. ఇక్క‌డ పాలిటిక్స్ కంటే క్రికెట్ కే ప్ర‌యారిటీ ఎక్కువ‌. ప్ర‌తి బంతికీ ప్ర‌తి ప‌రుగుకు కోట్ల రూపాయ‌లు చేతులు మారుతుంటాయి. వ‌ర‌ల్డ్ క్రికెట్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన ఏకైక క్రీడా సంస్థ గా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిలిచింది. భార‌త్ అంటేనే హాకీ. కానీ దాని ప్లేస్ లో క్రికెట్ చేరి పోయింది. ఎప్పుడైతే హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో భార‌త క్రికెట్ జ‌ట్టు లార్డ్స్ వేదిక‌గా 1983లో వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిందో ఆనాటి నుంచి క్రికెట్ ఫీవ‌ర్ యావ‌త్ భార‌తాన్ని ప‌ట్టి పీడిస్తోంది. ఇవాళ క్రికెట్ కోట్లాది మందికి ప్రాణ‌ప్ర‌తంగా మారింది. చిన్నారుల నుంచి వృద్దుల దాకా ప్ర‌తి ఒక్క‌రు ఈ ఆట‌కు ఫిదా అయిన వాళ్లే. చాలా మందికి ఓ అపోహ ఉంది క్రికెట్ ను రాజ‌కీయాలు శాసిస్తున్నాయ‌ని. కానే కాదు క్రికెట్ ప్ర‌స్తుతం భార‌త పాలిటిక్స్ ను శాసిస్తున్నాయంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఒక‌ప్పుడు ఆట‌లో ప్రొఫెష‌న‌లిజం ఉండేది. కానీ నేడు అది లేదు.

మొత్తం కార్పొరేట్ కంపెనీలు, బ‌డా వ్యాపార‌వేత్త‌లు, బిజినెస్ టైకూన్ల చేతుల్లోకి వెళ్లి పోయింది. ఇక రాను రాను టెక్నాల‌జీలో చోటు చేసుకున్న మార్పులు ఇప్పుడు క్రికెట్ కు పాకింది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి భార‌త్ లో బీసీసీఐ కీల‌క‌మైన సంస్థ‌గా మారింది. దాని మొత్తం ఆస్తుల విలువ లెక్కించ లేనంత‌గా మారింది. ఇప్పుడు బీసీసీఐలో ఎన్నో ప‌ద‌వులు ఉన్నాయి. కానీ దానిని న‌డిపించేదంతా ఒకే ఒక్క‌డు. అత‌డే కింగ్ మేక‌ర్ గా పేరు పొందిన జే షా(Jay Shah). ఎక్క‌డా ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. కానీ ఇప్పుడు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. బీసీసీఐకి కార్య‌ద‌ర్శిగానే కాదు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు చైర్మ‌న్ కూడా. త‌ను త‌ల్చుకుంటే ఎవ‌రినైనా మార్చ‌గ‌ల‌డు. ఇంకెవ‌రినైనా కూర్చో బెట్ట‌గ‌ల‌డు. ఎందుకంటే మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తిగా ఇప్ప‌టికే గుర్తింపు పొందాడు జే షా. ఈ జే షా(Jay Shah) ఎవ‌రో కాదు భార‌తీయ జ‌న‌తా పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా త‌న‌యుడు.

ఇంకేం తండ్రి అండ ఉంది. అంత‌కు మించి ప్ర‌ధాని మోదీతో సాన్నిహిత్యం ఉంది. దాని వెనుక కార్పొరేట్ శ‌క్తుల అండదండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. అంతెందుకు ఇటీవ‌లి దాకా బీసీసీఐకి బాస్ గా ఉన్న సౌర‌వ్ గంగూలీ ఉన్న‌ట్టుండి సైడ్ అయి పోయాడు. అలా చేసింది లాబీయింగ్ అని ఆరోప‌ణ‌లు లేక పోలేదు. విచిత్రం ఏమిటంటే బీసీసీఐకి రియ‌ల్ బాస్ రోజ‌ర్ బిన్నీ. ఆయ‌న ఉన్నా లేన‌ట్టే. ప్ర‌స్తుతం బీసీసీఐ త‌ర‌పున అన్నీ చెప్పేది..పంచుకునేది. నిర్ణ‌యాలు తీసుకునేది ..ఒకే ఒక్క‌డు జే షా. ఇవాళ ఐసీసీ వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ భార‌త్ లో నిర్వ‌హిస్తోంది. ఎక్కువ మ్యాచ్ లు అహ్మ‌దాబాద్ లో ఆడేలా చేశాడు షా. బ‌య‌ట‌కు ఎవ‌రూ నోరు మెదిపే ప్ర‌స‌క్తి లేదు. ఎందుకంటే బీసీసీఐ కాదు అది బీజేపీ ఆఫీసు అని టీఎంసీ చీఫ్‌, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు చేశారు. ఏది ఏమైనా అధికారం మ‌న చేతుల్లో ఉంటే ఏమైనా ద‌క్కుతుంది క‌దూ. ఎంతైనా జే షా (Jay Shah)అదృష్ట‌వంతుడు..కాదంటారా..

Also Read : WFI Chief : డ‌బ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై విచార‌ణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!