Jaya kishori Morari Bapu : బాపు సాంగ‌త్యం అద్భుతం – జ‌యా

ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలం ఆయ‌న జీవితం

Jaya kishori Morari Bapu : భార‌త దేశం అంటేనే ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలం. ఈ ప‌విత్ర‌మైన దేశాన్ని ఎంద‌రో పునీతం చేశారు. మ‌రికొంద‌రు త‌మ‌దైన ముద్ర‌ను క‌న‌బ‌ర్చారు. వారిలో ఒక‌రు మొరారీ బాపు(Morari Bapu). జ‌గ‌మెరిగిన ఆధ్యాత్మిక నాయ‌కుడు. తుల‌సీ దాస్ రాసిన రామ్ చ‌రిత్ మాన‌స్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన గొప్ప ప్ర‌వ‌క్త మొరారీ బాపు అని కొనియాడారు ఆధ్యాత్మిక కోచ్ జ‌యా కిషోరి.

ఆ అద్భుత‌మైన , ఆధ్యాత్మిక‌త‌తో నిండిన బాపును క‌ల‌వ‌డం త‌న జీవితంలో మ‌రిచి పోలేని సంఘ‌ట‌న‌గా పేర్కొన్నారు. ఆయ‌న బోధ‌న‌లు , జీవితం అంతా స‌త్యం , ప్రేమ‌, క‌రుణ‌తో నిండి ఉంద‌ని ప్ర‌శంసించారు.
ఆయ‌న‌కు 77 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా నేటికీ చాలా ప్ర‌శాంతంగా ఉంటారు. క‌రుణ నిండిన మొరారీ బాపును చూస్తే చాలు అనుకునే భ‌క్తులు ల‌క్ష‌ల్లో ఉన్నారు. నేటికీ ఆయ‌న గొంతు నుంచి నిండిన రామ్ చ‌రిత్ మాన‌స్ ను ప్ర‌తి రోజూ కోట్లాది మంది వింటూ ఉంటారు.

ఇవాళ తన‌ను క‌లుసు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు జ‌యా కిషోరి. ప్ర‌స్తుతం ఆమె ఆధ్యాత్మిక‌వేత్త , బోధ‌కుడు మొరారీ బాపుతో క‌లిసిన ఫోటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. మాన‌వ జీవితానికి సార్థ‌క‌త చేకూరాలంటే ఒక్క‌టే మార్గం ఆధ్యాత్మికం అని స్ప‌ష్టం చేశారు జ‌యా కిషోరి.

Also Read : Sapthagiri Balakrishna : బాల‌య్య‌ను చూస్తే పూన‌కాలే – స‌ప్త‌గిరి

Leave A Reply

Your Email Id will not be published!