Jayaprakash Narayan : పని చేసే వాళ్లకు ఓటు వేయండి
లోక్ సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ
Jayaprakash Narayan : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్బంగా మేధావులు, బుద్ది జీవులు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఓటర్లను కోరుతున్నారు. పని చేసే వాళ్లకు, అభివృద్దిని చూసి విలువైన ఓటు వేయాలని పిలుపునిచ్చారు లోక్ సత్తా పార్టీ కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్(Jayaprakash Narayan).
Jayaprakash Narayan Comment
బుధవారం సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశం ఇచ్చారు. ఓటు వజ్రాయుధమని దానిని ఎట్టి పరిస్థితుల్లో అమ్ము కోవద్దని కోరారు. మద్యం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. పార్టీలు చేసే తాత్కాలిక ప్రలోభాలకు లొంగి పోతే రాబోయే భవిష్యత్తును కోల్పోతారని సూచించారు జేపీ.
విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత కల్పించే పార్టీలకు, నేతలకు మాత్రమే ఓటు వేయాలని కోరారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తతో ఉండాలని పేర్కొన్నారు లోక్ సత్తా పార్టీ కన్వీనర్.
డబ్బంతా కేవలం తాత్కాలిక అవసరాలకే ఖర్చు పెట్టి రేపు ఏమీ లేకుండా చేసే వాళ్లు ఖచ్చితంగా మనందరి భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారవుతారని గుర్తు పెట్టు కోవాలన్నారు.
Also Read : Revanth Reddy : రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం