Jayasudha Changes Parties : నాలుగు పార్టీలు మారిన జయసుధ
పేరుకు సేవ పదవే ముఖ్యం
Jayasudha Changes Parties : ప్రస్తుతం సహజనటిగా పేరు పొందిన జయసుధ హాట్ టాపిక్ గా మారారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో నటించారు. మంచి నటిగా పేరు పొందారు. ఇది పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. కారణం ఏమిటంటే తాను కుల, మతాలను పట్టించుకోనని కేవలం మోదీని చూసి బీజేపీలో చేరానంటూ చెప్పారు.
Jayasudha Changes Parties Viral
పైకి ఎన్ని చెప్పినా పదవులే ముఖ్యమని తేలి పోయిందంటున్నారు నెటిజన్లు. కారణం ఆమె ఇప్పటికీ తన పొలిటికల్ కెరీర్ లో తాజాగా బీజేపీ(BJP) తీర్థం పుచ్చుకోవడంతో నాలుగు పార్టీలు మారినట్లయింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధి కావడానికి గ్లామర్ పనికి వస్తుందేమో కానీ గౌరవం ఉండదని తెలుసు కోవాలి. ఇక ఇప్పటి వరకు చూస్తే తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 నుంచి 2014 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2016లో నారా చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
2019లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం 2023లో ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకున్నారు. సేవ చేయడానికి రాజకీయ పార్టీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
Also Read : Arvind Kejriwal : అంబేద్కర్ ఆదర్శం విద్యతోనే వికాసం