Ajay Alok Joins : బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన అజయ్ అలోక్ ఉన్నట్టుండి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్టవ్.
ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్ర రాజకీయాలలో పదునైన స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు ఇంత కాలం అజయ్ అలోక్(Ajay Alok Joins). ఆయనకు రాష్ట్ర సమస్యలపై మంచి పట్టుంది. దీంతో పేరొందిన నాయకుడు తమ పార్టీలో చేరడం వల్ల అదనపు బలం చేకూరినట్లయిందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఇక నుంచి రాష్ట్రంలో నితీశ్ కుమార్ కు నిద్ర పోవడం అంటూ ఉండదన్నారు. ఎందుకంటే గత కొంత కాలంగా నితీశ్ కు నమ్మిన బంటుగా పేరు పొందారు. ఇక అజయ్ అలోక్ బీజేపీలో చేరడం ఒక కుటుంబంలోకి వచ్చినట్లయ్యిందన్నారు అశ్విని వైష్ణవ్.
టీవీ చర్చల్లో నిత్యం తన పదునైన వాయిస్ ను వినిపిస్తూ వచ్చారు జేడీయూ మాజీ నేత అజయ్ అలోక్. బీజేపీలో చేరిన అనంతరం అజయ్ అలోక్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యావత్ దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నిర్దేశించిన మార్గంలోనే నడుస్తోందన్నారు. తాను కూడా అందులో భాగం పంచు కోవడం ఆనందంగా ఉందన్నారు.
Also Read : మహిళలకు బస్సుల్లో ఫ్రీ – కాంగ్రెస్